Saturday 14 July 2012

మలేషియా మామిడి కాయ

  మలేషియాలో నా స్నేహితుడు అంగప్పన్ వారి చెట్టుకు కాసిన 2.5కిలోల బరువు గల మామిడి కాయను ఈ రోజు  ఇచ్చాడు. మొదట గుమ్మడి కాయేమోనని బ్రమించాను కాని పరిశీలంచి మామిడి కాయేనని నిర్ధారించుకున్నాను. ఏదో మీరు కూడా చూస్తారని....... 

Monday 7 May 2012

CCKరావు గారు మీ పోస్ట్‌కు నా సమాదానం

రావు గారు మీరు నా కామెంటుకు సమాదానంగా ఎకంగా ఒక పోస్ట్‌నే వేశారు.నేను కూడ మీ పద్దతి అనుసరించక పోతే బగుండదు కదా? అందుకే ఇలా.

రావు:- బ్లాగు పునర్వ్యవస్థీకరనలో భాగంగా కొన్ని లింకులు పనిచేయడం లేవు, గమనించగలరు.

నేను మీరు చేసిన తప్పును ఎత్తి చూపాను కాబట్టి బ్లాగును పునఃనిర్మించే పనిలో పడ్డారు సంతోషం.

రావు:- నా బ్లాగులో వ్రాసే ప్రతి విషయంపై నాకు హక్కు ఉంది. నా అనుమతి లేకుండా కాపీచేయడానికి ఎవరికీ హక్కులేదు.

నిజమే ఇదివరకే ఉన్న విషయాన్ని ఉపయోగించి ఒక కొత్త వ్యాసాన్ని రూపొందిస్తే ఆ వ్యాసాన్ని రచయిత అనుమతి లేకుండా ఉన్నది ఉన్నట్లుగా కాపీ చేయడం క్షమించరాని నేరం. వ్యాస రచయితకు చర్యలు తీసుకునే సంపూర్ణ హక్కులు కలిగి ఉంటాయి, కాని ఆ వ్యాసంలో వ్యస కర్త స్వంతం కాని విషయాలను లేదా కొన్ని పదాలను ఇతరులు వాడుకోవచ్చనే నా ఉద్దేశ్యం. ఇలా ఉపయోగించకపోతే ఇన్ని రచనలు వచ్చి ఉండేవి కావు.

రావు:- రమేష్ గారు, జైల్ సింగ్ గురించి వ్రాసిన విషయాలు నా స్వంతం కాదు ఆ విషయం ముందే చెప్పానుగా! కాని అనేక వనరుల నుంచి సేకరించిన సమాచారం ఒక పద్దతిలో నాదైన శైలిలో వ్రాసి సమాచారం సిద్ధం చేశాను.

అదే నేను మీకు వేసే ప్రశ్న మీరు ఇతరుల వనరులను ఉపయోగించేప్పుడు మీకు కాపీరైట్ గుర్తుకు రాలేదు, కాని ఇతరులు మీ వనరులు ఉపయోగిస్తే మీకు కాపీరైట్ గుర్తుకు వచ్చిందా?!!

రావు:- పత్రికల వారుసైతం వికీపీడియాలపై ఆధారపడతారు. తెలుగు వికీపీడీయాలో నేను రాసిన అనేక వ్యాసాలు (కొన్ని మక్కికిమక్కి) పత్రికలలో ప్రచురితమైనాయి. అది స్వేచ్ఛావిజ్ఞానసర్వస్వం కాబట్టి ఏమీ చెప్పలేము, కాకుంటే ఫలానా చోటు నుంచి తీసుకున్నాము అని పెట్టడం మంచిది (వికీపీడియా కూడా ఇదే చెబుతుంది).

మీరు ఇతరుల వనరులు వాడుకుంటానని సెలవిచ్చారు. మీరేందుకు ఈ విషయం ఫలాన చోటు నుండి సేకరించిందని పేర్కోనడం లేదు? అంటే మీకో నీతి ఇతరులకు ఇంకో నీతా?

రావు:-  జైల్ సింగ్ నా స్వంతం కాకున్నా వాక్యాలను రూపుదిద్దినది మాత్రం నేనే కాబట్టి ఆ వాక్యాలపై నాకు పూర్తి అధికారం ఉంది. నేను ఎవరివద్ద నుంచీ మక్కికిమక్కి చేయడం లేదు కాబట్టి వనరులు ఇచ్చే అవసరం కూడా లేదు.

జైల్ సింగ్  (ఇది ఒక్క జైల్ సింగ్ గారి గురించి కాదు మీ బ్లాగులో ఉన్న కాంటేంట్‌కు ఉదహారణ) పుట్టిన తేది, మరణించిన తేది, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి అయిన తేదీలు మీరు రాశారు, ఇలాంటి విషయాలు ఎవరు రాసిన మక్కికి మక్కిగానే వస్తాయి. మీరు రాశారని మేం మార్చి రాయాలా?!!!!


రావు:-  జైల్ సింగ్ పోస్టులోని కొన్ని వాక్యాలు తీసుకొని  మరికొన్ని వనరుల నుంచీ సమాచారం సేకరించి మీరు కొత్తగా వ్యాసం తయారుచేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. అంతేకాని మక్కికిమక్కిగా నాదైన శైలిలో తయారుచేస్తున్న సమాచారం కాపీచేయరాదనేదే నేను చెప్పేది.

రావు:- వాక్యాలను రూపుదిద్దినది మాత్రం నేనే కాబట్టి ఆ వాక్యాలపై నాకు పూర్తి అధికారం ఉంది. నేను ఎవరివద్ద నుంచీ మక్కికిమక్కి చేయడం లేదు కాబట్టి వనరులు ఇచ్చే అవసరం కూడా లేదు.

రావు గారు పై వ్యాఖ్యను కింది వ్యాఖ్యను మరొక్క సారి పరిశీలించండి
 మిటండి రెండు నాలుకల దోరిణి. ఇక్కడ నేను ఒక జైల్ సింగ్ గారి పోస్ట్ గురించే వాదించడం లేదు. //హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది// అనే మీ మాటకు మాత్రమే నా స్పందన. నా పోస్టులోని కొన్ని వాక్యాలు తీసుకొని  మరికొన్ని వనరుల నుంచీ సమాచారం సేకరించి మీరు కొత్తగా వ్యాసం తయారుచేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. అంతేకాని మక్కికిమక్కిగా నాదైన శైలిలో తయారుచేస్తున్న సమాచారం కాపీచేయరాదు. మీ హెచ్చరిక స్థానంలో ఈ వ్యాఖ్యను ప్రదర్శించండి సమంజసంగా ఉంటుంది.అంతే గాని తలా తోక లేని నిబందనలు పెట్టకండి. రావు గారు మీకొక్క విషయం చెప్పాలండీ ఇప్పుడు బ్లాగుల్లో,ఇంటర్‌నెట్లలో 99.99 శాతం సమాచారం ఎక్కడో అక్కడి నుండి సేకరించినదే. స్వంతంగా రాసే రచనలను ఎవరు కాపీ కొట్టేందుకు ప్రయత్నించరండి. వేమన,సుమతీ లాంటి శతకాలను ఒక్క సారి పరిశీలించండి. వాటికి పేటేంట్లు, కాపీరైట్ చట్టాలు హెచ్చరికలు  ఉన్నాయా ? ఈ శతకాల్లో ఒక్క పదాన్ని మార్చి నా స్వంతం అనుకో గలమా, వీటీలో పదాలను మార్చే ధైర్యం చేయగలమా?

నేను మీకు CCKరావు గారు నేనొక విషయం మిమ్మల్ని సూటిగా అడుగాలనుకుంటున్నాను YES/NO రెండే మాటల్లో చెప్పండి. మీబ్లాగ్‌లో ప్రచురించే ప్రతి విషయం ఎక్కడ చదవకుండా,సేకరించకుండా మీరే స్వంతంగా తయారు చేస్తున్నారా? YES/NO అనే  కామేంట్ రాశాను.
దానికి సమాదానం ఇవ్వచ్చు కాని పోస్ట్ రూపంలో రాశారు  ప్రపంచంలో మీకొక్కరికే బ్లాగుందా? మాకు లేవా? మేం రాయలేమా?పత్రికల అనుమతులు లేకుండా వారి పేపర్ల కట్టింగ్‌లను మక్కికి మక్కిగా రిఫరెన్సులుగా ఉపయోగించే సంఘటనలు ఉన్నాయి. ఏ పత్రికలు ఇది మీరు చదవటానికి మాత్రమే రెఫరెన్సులుగా ఎక్కడ ఉపయోగించ వద్దని చెప్పిన దాఖలాలు లేవే, ఇలాంటివి చాలా బ్లాగుల్లో దర్శనమిస్తున్నాయి కూడా. మీది కాని దానిపై మీకు నాది అనే ఆహం ఉంది అందుకే మీరు ఇలా హెచ్చరిస్తున్నారు.రావు గారు ఏ లాబాపేక్ష లేకుండా మనం రాసిన దాన్ని ఇతరులు వాడుకుంటున్నారంటే మనకు గర్వ కారణమే కదండి. మన రచనలు వాడుకున్న ఇతరులకు   మనకున్న పరిజ్ఞానం లేదనేగా అర్థం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందండి ఆలోచించండి.

  మీరు వాదించేదే సమంజసమని మీరనుకుంటే మీ బ్లాగులో పబ్లిష్ అయ్యే ప్రతి పోస్ట్‌ను నా బ్లాగులో పబ్లిష్ చేస్తాను ఏ కాపీ రైట్ చట్టాలు ఉపయోగించి నాపై చర్య తీసుకుంటారో మీ ఇష్టం.

Sunday 6 May 2012

CCK రావు గారు మక్కికి మక్కిగా మీ బ్లాగునుండి రాసే వాళ్ల కోసమా ఈ ప్రయత్నం!!!








  • జైల్ సింగ్ ఎప్పుడు జన్మించారు-- మే 5, 1916.
  • జైల్ సింగ్ రాష్ట్రపతిగా పనిచేసిన కాలం-- 1982-87.
  • జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ప్రధానమంత్రులు-- ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ.
  • జైల్ సింగ్‌కు ముందు భారత రాష్ట్రపతి-- నీలం సంజీవరెడ్డి.
  • జైల్ సింగ్ తర్వాత భారత రాష్ట్రపతి-- ఆర్.వెంకటరామన్.
  • జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో జరిగిన ముఖ్య సంఘటనలు-- ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య.






  • జైల్ సింగ్ 1982లో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు-- పంజాబ్.



  • (జైల్ సింగ్ గారు 1982లో పంజాబ్ ముఖ్య మంత్రిగా పని చేయలేదు. 1982లో పంజాబ్ ముఖ్యమంత్రిగా  దర్భారా సింగ్ ఉన్నారు. జైల్ సింగ్ గారు కాంగ్రెస్ తరఫున  ముఖ్య మంత్రిగా పని చేసిన కాలం 17మార్చి 1972 నుండీ 30 ఎప్రిల్ 1977 వరకు )

                      

    వీకీపేడీయా సమాచారం స్క్రీన్ షాట్







  • 1983-86 కాలంలో జైల్ సింగ్ ఏ అంతర్జాతీయ కూటమికి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు-- అలీనదేశాల కూటమి.
  • జైల్ సింగ్ ఎప్పుడు మరణించారు-- డిసెంబరు 25, 1994.
  • జైల్ సింగ్ సమాధిపేరు-- ఏక్తాస్థల్.


  • ఇప్పుడు చెప్పండి రావు గారు మీ కాంటేంట్‌ను నమ్ముకొని పోటీ పరీక్షలకు తయారైతే గోవిందా..గోవిందా..  మిమ్మల్ని నమ్మాలా? వికిపిడియాను నమ్మాలా? !!! ఇప్పుడు మీకేమనిపిస్తుందో నాకర్థమవట్లేదండీ!!

    ఆ.. ఏమిటీ మక్కికి మక్కిగా మీ బ్లాగునుండి రాసే వాళ్లను పట్టుకునేందుకా ఈ ప్రయత్నం!! మీ ప్రయత్నం అబినందనీయమండీ!!


    CCKరావు గారి బ్లాగు:  http://cckrao2000.blogspot.com/2012/05/zail-singh.html


                                                                  రావు గారి బ్లాగ్ స్క్రీన్ షాట్

    Sunday 29 April 2012

    దయామయులు ఈ సరస్వతి పుతృనికి ప్రాణభిక్ష ప్రసాదించరూ...

                          రెండు కిడ్నీలు కోల్పోయిన డబుల్ పీజీ విద్యార్థి.

                                         * రోజు రోజుకు క్షీణిస్తున్న ఆరోగ్యం.
                                         * ఆర్థిక ఇబ్బందుల్లో నిరుపేద కుటుంభం.
                                         * డయాలసిస్‌తో జీవిస్తున్న దయనీయ పరిస్థితి.
                                         * అపన్నుల హస్తం కొసం ఎదురు చూపులు.


                          ఇతని పేరు కాదాసి.రమేష్, జవహార్‌నగర్, గోదావరిఖని, కరీంనగర్ జిల్లా, ఆంద్రప్రదేశ్

    కొడుకును ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులు,ఉద్యోగం చేసి తమ కష్టాలు తీరుస్తాడని ఎంతో పొంగిపోయారు. తల్లిదండ్రుల అభిష్టానికి అనుగుణంగానే ఆ కొడుకు అంతే కష్టపడి ఎంసిఏ,ఎమ్మెస్సీ మ్యాథ్స్ చేసి ఉద్యోగ వేటలో పడ్డాడు. కాని ఇంతలో రెండున్నరేళ్ల క్రితం ఒళ్లంత వాపులు మొదలయ్యాయి, ఆరునెలలు వైద్యం చేయించుకున్న పరిస్థితిలో మార్పు లేదు.దీంతో తల్లిదండ్రులు తమ కుమారున్ని ఓ ప్రైవేట్ హస్పటల్‌లో చూపించగా అక్కడి డాక్టర్లు రెండు కిడ్నీలు చెడిపోయాయని కిడ్ని మార్పిడి శస్త్ర చికిత్స జరపాలని   పిడుగు లాంటి వార్త తెలిపారు. 

    కిడ్నీ మార్పిడీ శస్త్ర చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో ఆరోగ్యశ్రీ కార్డు సహాయతో వారానికి రెండు సార్లు డయాలసిస్ జరిపించే వారు. ఐతే డయాలసిస్ చేయిస్తున్న సమయంలో హైపటైటీస్-సి సోకిండంతో పాటు రక్తంలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పులి మీద పుట్రలా ఇటీవల గుండెపోటుకు కూడ గురయ్యాడు, కడుపు ఉబ్బడం లాంటి వాటితో బాద పడుతున్నాడు.ప్రస్తుతం వైద్యులు వారానికి మూడుసార్లు డయాలసిస్ చేస్తున్నారు.

    ఆరోగ్యశ్రీ ద్వార డయాలసిస్ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు ట్రస్ట్ ద్వార వచ్చే డబ్బుల గురించే ఆలోచిస్తున్నరనే అనుమానంతో కుటుంభ సభ్యులు ఇటీవల హైదరాబాద్  లోని NIMSలో చూపించారు. అక్కడి వైద్యులు పరిశీలించి ఆలస్యం చేసినందుకు ఆవేదన వ్యక్తం చేసి వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని సూచించడంతో, రమేష్ తల్లి మధునమ్మ కిడ్ని ఇవ్వడానికి అంగీకరించింది.   



     ఐతే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సకు, మందులకు సుమారు 7లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.ఇప్పటికే 2లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టిన తమకు ఈమొత్తం బారంగా మారిందని తల్లిదండ్రులు దిక్కు తోచక కన్నీరుమున్నీరుగ విలపిస్తున్నారు. దాతల సహాయాన్ని ఆర్ధిస్తున్నారు,అలాగే ప్రభుత్వం తమ కుమారుని పట్ల స్పందించి ఆదుకోవాలని ప్రార్థిస్తున్నారు. స్వచ్చంద సంస్థలు, దయామయులైన దాతలు స్పందించి తమ కుమారునికి పుఃనర్జన్మ ప్రసాదించాలని కోరుతున్నారు.

    కాదాసి.రమేష్, జవహార్‌నగర్, గోదావరిఖని, కరీంనగర్ జిల్లా, ఆంద్రప్రదేశ్ మొబైల్ నెంబర్ 0091 99853 12392 లో దాతలు సంప్రదించి తమ చేతనైన సహాయం అందించ గలరని  మనవి.

    A/C No: 62047021414
    KADASI RAMESH,
    Sate Bank Hyderabad,
    Branch : Singareni Collieries Company Ltd (SCCL) ,
    Godavarikhani,
    Karimnagar (Dist)
    Andhrapradesh (State)
    INDIA
                     
                             "ఫోటోలు మరియు విషయ సేకరణ సాక్షి దిన పత్రిక నుండి"




    Thursday 5 April 2012

    ఈ సైట్ లో జాయిన్ అయితే మీకు డబ్బులు చెల్లిస్తుంది

    గూగుల్, ఫేస్ బుక్ వెబ్ సైట్ లు కోట్ల రూపాయల ఆదాయం ప్రజల ద్వారా సంపాదిస్తున్నా ఒక్క రూపాయి కూడా ప్రజలకు వెనక్కు ఇవ్వని సంగతి తెలిసిందే.ఈ నెల తొమ్మిదో తారీకున కొత్త కాన్సెప్ట్ తో ఒక వెబ్ సైట్ లాంచ్ కానుంది.దీని పేరు వాజాబ్.ఈ సైట్ ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని ఈ సైట్ లో జాయిన్ అయ్యే యూజర్స్ కి పంచి పెట్టనుంది.

    ఈ వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

    దీనికి మీరు చెయ్యాల్సిందల్లా ఇక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వడమే.క్లిక్ చేసిన తరువాత మీకొక విండో ఓపెన్ అవుతుంది.కొంచెం క్రింద ఉన్న ఫస్ట్ నేం లాస్ట్ నేం లలో మీ పేరు ఇచ్చిన తరువాత పాస్వర్డ్ కాలంలో మీ పాస్వర్డ్ ఇవ్వండి.తరువాత మీ మెయిల్ ఐడి ఇచ్చి కంట్రీని సెలెక్ట్ చేసుకోండి.దీని క్రింద ఉన్న రెండు కోడ్ లను తప్పులు లేకుండా ఎంటర్ చేసి జాయిన్ ని నొక్కడమే.

    ఈ వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

    తరువాత మీ మెయిల్ ఐడి కి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది.దాంట్లో ఉన్నలింక్ ని చేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.అక్కడ మీకొక ఇన్విటేషన్ లింక్ కనపడుతుంది.దాన్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్ కి కుటుంబ సభ్యులకు పంపడం ద్వారా మీ నెట్వర్క్ ని పెంచుకోండి.మీ నెట్వర్క్ లో కనీసం ముగ్గురు వుంటే గాని ఆదాయం పొందటానికి అర్హులు కారు.

    ఈ వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

    ఈ నెల (ఏప్రిల్) 9 తో ఈ ఆఫర్ క్లోజ్ అవుతుంది.కాబట్టి ఈ లోపు ఎంత మందిని జాయిన్ చేసుకుంటే అంత ఆదాయం ప్రతీ నేలా ఇస్తామంటున్నారు ఈ వెబ్ సైట్ ఓనర్స్.దీంట్లో జాయిన్ అవడానికి ఎటువంటి డబ్బులూ చెల్లించనవసరం లేదు కాబట్టి రిస్క్ లేదు.ప్రయత్నించి చూడండి

    ఈ వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.


    నోట్:- ఈ సైట్ లో జాయిన్ అయితే మీకొక వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది.అది స్పామ్ కి వెళుతుంది కనుక స్పామ్ లో చూసి అందులో ఉన్న లింక్ ని క్లిక్ చేసి లాగిన్ కాగలరు.లేకపోతే మీకు ఎటువంటి ఉపయోగం వుండదు.

    సేకరణ: http://teluguviews.blogspot.com

    Tuesday 14 February 2012

    ఈ శీర్షికకు అర్థమేమిటి?

    కొందరు విలేఖరుల పాండిత్యం, అతి ఉత్సాహాం వల్ల ఇలాంటి అసంధర్భ శీర్షికలు ఉద్భవిస్తాయనడానికి ఇదో మచ్చుతునక మాత్రమే.ఈ శీర్షిక సమంజసమంటారా? ఓదార్పంటే ఇదేనా?