Sunday 29 April 2012

దయామయులు ఈ సరస్వతి పుతృనికి ప్రాణభిక్ష ప్రసాదించరూ...

                      రెండు కిడ్నీలు కోల్పోయిన డబుల్ పీజీ విద్యార్థి.

                                     * రోజు రోజుకు క్షీణిస్తున్న ఆరోగ్యం.
                                     * ఆర్థిక ఇబ్బందుల్లో నిరుపేద కుటుంభం.
                                     * డయాలసిస్‌తో జీవిస్తున్న దయనీయ పరిస్థితి.
                                     * అపన్నుల హస్తం కొసం ఎదురు చూపులు.


                      ఇతని పేరు కాదాసి.రమేష్, జవహార్‌నగర్, గోదావరిఖని, కరీంనగర్ జిల్లా, ఆంద్రప్రదేశ్

కొడుకును ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులు,ఉద్యోగం చేసి తమ కష్టాలు తీరుస్తాడని ఎంతో పొంగిపోయారు. తల్లిదండ్రుల అభిష్టానికి అనుగుణంగానే ఆ కొడుకు అంతే కష్టపడి ఎంసిఏ,ఎమ్మెస్సీ మ్యాథ్స్ చేసి ఉద్యోగ వేటలో పడ్డాడు. కాని ఇంతలో రెండున్నరేళ్ల క్రితం ఒళ్లంత వాపులు మొదలయ్యాయి, ఆరునెలలు వైద్యం చేయించుకున్న పరిస్థితిలో మార్పు లేదు.దీంతో తల్లిదండ్రులు తమ కుమారున్ని ఓ ప్రైవేట్ హస్పటల్‌లో చూపించగా అక్కడి డాక్టర్లు రెండు కిడ్నీలు చెడిపోయాయని కిడ్ని మార్పిడి శస్త్ర చికిత్స జరపాలని   పిడుగు లాంటి వార్త తెలిపారు. 

కిడ్నీ మార్పిడీ శస్త్ర చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో ఆరోగ్యశ్రీ కార్డు సహాయతో వారానికి రెండు సార్లు డయాలసిస్ జరిపించే వారు. ఐతే డయాలసిస్ చేయిస్తున్న సమయంలో హైపటైటీస్-సి సోకిండంతో పాటు రక్తంలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పులి మీద పుట్రలా ఇటీవల గుండెపోటుకు కూడ గురయ్యాడు, కడుపు ఉబ్బడం లాంటి వాటితో బాద పడుతున్నాడు.ప్రస్తుతం వైద్యులు వారానికి మూడుసార్లు డయాలసిస్ చేస్తున్నారు.

ఆరోగ్యశ్రీ ద్వార డయాలసిస్ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు ట్రస్ట్ ద్వార వచ్చే డబ్బుల గురించే ఆలోచిస్తున్నరనే అనుమానంతో కుటుంభ సభ్యులు ఇటీవల హైదరాబాద్  లోని NIMSలో చూపించారు. అక్కడి వైద్యులు పరిశీలించి ఆలస్యం చేసినందుకు ఆవేదన వ్యక్తం చేసి వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని సూచించడంతో, రమేష్ తల్లి మధునమ్మ కిడ్ని ఇవ్వడానికి అంగీకరించింది.   



 ఐతే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సకు, మందులకు సుమారు 7లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.ఇప్పటికే 2లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టిన తమకు ఈమొత్తం బారంగా మారిందని తల్లిదండ్రులు దిక్కు తోచక కన్నీరుమున్నీరుగ విలపిస్తున్నారు. దాతల సహాయాన్ని ఆర్ధిస్తున్నారు,అలాగే ప్రభుత్వం తమ కుమారుని పట్ల స్పందించి ఆదుకోవాలని ప్రార్థిస్తున్నారు. స్వచ్చంద సంస్థలు, దయామయులైన దాతలు స్పందించి తమ కుమారునికి పుఃనర్జన్మ ప్రసాదించాలని కోరుతున్నారు.

కాదాసి.రమేష్, జవహార్‌నగర్, గోదావరిఖని, కరీంనగర్ జిల్లా, ఆంద్రప్రదేశ్ మొబైల్ నెంబర్ 0091 99853 12392 లో దాతలు సంప్రదించి తమ చేతనైన సహాయం అందించ గలరని  మనవి.

A/C No: 62047021414
KADASI RAMESH,
Sate Bank Hyderabad,
Branch : Singareni Collieries Company Ltd (SCCL) ,
Godavarikhani,
Karimnagar (Dist)
Andhrapradesh (State)
INDIA
                 
                         "ఫోటోలు మరియు విషయ సేకరణ సాక్షి దిన పత్రిక నుండి"




Thursday 5 April 2012

ఈ సైట్ లో జాయిన్ అయితే మీకు డబ్బులు చెల్లిస్తుంది

గూగుల్, ఫేస్ బుక్ వెబ్ సైట్ లు కోట్ల రూపాయల ఆదాయం ప్రజల ద్వారా సంపాదిస్తున్నా ఒక్క రూపాయి కూడా ప్రజలకు వెనక్కు ఇవ్వని సంగతి తెలిసిందే.ఈ నెల తొమ్మిదో తారీకున కొత్త కాన్సెప్ట్ తో ఒక వెబ్ సైట్ లాంచ్ కానుంది.దీని పేరు వాజాబ్.ఈ సైట్ ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని ఈ సైట్ లో జాయిన్ అయ్యే యూజర్స్ కి పంచి పెట్టనుంది.

ఈ వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

దీనికి మీరు చెయ్యాల్సిందల్లా ఇక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వడమే.క్లిక్ చేసిన తరువాత మీకొక విండో ఓపెన్ అవుతుంది.కొంచెం క్రింద ఉన్న ఫస్ట్ నేం లాస్ట్ నేం లలో మీ పేరు ఇచ్చిన తరువాత పాస్వర్డ్ కాలంలో మీ పాస్వర్డ్ ఇవ్వండి.తరువాత మీ మెయిల్ ఐడి ఇచ్చి కంట్రీని సెలెక్ట్ చేసుకోండి.దీని క్రింద ఉన్న రెండు కోడ్ లను తప్పులు లేకుండా ఎంటర్ చేసి జాయిన్ ని నొక్కడమే.

ఈ వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

తరువాత మీ మెయిల్ ఐడి కి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది.దాంట్లో ఉన్నలింక్ ని చేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.అక్కడ మీకొక ఇన్విటేషన్ లింక్ కనపడుతుంది.దాన్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్ కి కుటుంబ సభ్యులకు పంపడం ద్వారా మీ నెట్వర్క్ ని పెంచుకోండి.మీ నెట్వర్క్ లో కనీసం ముగ్గురు వుంటే గాని ఆదాయం పొందటానికి అర్హులు కారు.

ఈ వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈ నెల (ఏప్రిల్) 9 తో ఈ ఆఫర్ క్లోజ్ అవుతుంది.కాబట్టి ఈ లోపు ఎంత మందిని జాయిన్ చేసుకుంటే అంత ఆదాయం ప్రతీ నేలా ఇస్తామంటున్నారు ఈ వెబ్ సైట్ ఓనర్స్.దీంట్లో జాయిన్ అవడానికి ఎటువంటి డబ్బులూ చెల్లించనవసరం లేదు కాబట్టి రిస్క్ లేదు.ప్రయత్నించి చూడండి

ఈ వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.


నోట్:- ఈ సైట్ లో జాయిన్ అయితే మీకొక వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది.అది స్పామ్ కి వెళుతుంది కనుక స్పామ్ లో చూసి అందులో ఉన్న లింక్ ని క్లిక్ చేసి లాగిన్ కాగలరు.లేకపోతే మీకు ఎటువంటి ఉపయోగం వుండదు.

సేకరణ: http://teluguviews.blogspot.com