Monday 7 May 2012

CCKరావు గారు మీ పోస్ట్‌కు నా సమాదానం

రావు గారు మీరు నా కామెంటుకు సమాదానంగా ఎకంగా ఒక పోస్ట్‌నే వేశారు.నేను కూడ మీ పద్దతి అనుసరించక పోతే బగుండదు కదా? అందుకే ఇలా.

రావు:- బ్లాగు పునర్వ్యవస్థీకరనలో భాగంగా కొన్ని లింకులు పనిచేయడం లేవు, గమనించగలరు.

నేను మీరు చేసిన తప్పును ఎత్తి చూపాను కాబట్టి బ్లాగును పునఃనిర్మించే పనిలో పడ్డారు సంతోషం.

రావు:- నా బ్లాగులో వ్రాసే ప్రతి విషయంపై నాకు హక్కు ఉంది. నా అనుమతి లేకుండా కాపీచేయడానికి ఎవరికీ హక్కులేదు.

నిజమే ఇదివరకే ఉన్న విషయాన్ని ఉపయోగించి ఒక కొత్త వ్యాసాన్ని రూపొందిస్తే ఆ వ్యాసాన్ని రచయిత అనుమతి లేకుండా ఉన్నది ఉన్నట్లుగా కాపీ చేయడం క్షమించరాని నేరం. వ్యాస రచయితకు చర్యలు తీసుకునే సంపూర్ణ హక్కులు కలిగి ఉంటాయి, కాని ఆ వ్యాసంలో వ్యస కర్త స్వంతం కాని విషయాలను లేదా కొన్ని పదాలను ఇతరులు వాడుకోవచ్చనే నా ఉద్దేశ్యం. ఇలా ఉపయోగించకపోతే ఇన్ని రచనలు వచ్చి ఉండేవి కావు.

రావు:- రమేష్ గారు, జైల్ సింగ్ గురించి వ్రాసిన విషయాలు నా స్వంతం కాదు ఆ విషయం ముందే చెప్పానుగా! కాని అనేక వనరుల నుంచి సేకరించిన సమాచారం ఒక పద్దతిలో నాదైన శైలిలో వ్రాసి సమాచారం సిద్ధం చేశాను.

అదే నేను మీకు వేసే ప్రశ్న మీరు ఇతరుల వనరులను ఉపయోగించేప్పుడు మీకు కాపీరైట్ గుర్తుకు రాలేదు, కాని ఇతరులు మీ వనరులు ఉపయోగిస్తే మీకు కాపీరైట్ గుర్తుకు వచ్చిందా?!!

రావు:- పత్రికల వారుసైతం వికీపీడియాలపై ఆధారపడతారు. తెలుగు వికీపీడీయాలో నేను రాసిన అనేక వ్యాసాలు (కొన్ని మక్కికిమక్కి) పత్రికలలో ప్రచురితమైనాయి. అది స్వేచ్ఛావిజ్ఞానసర్వస్వం కాబట్టి ఏమీ చెప్పలేము, కాకుంటే ఫలానా చోటు నుంచి తీసుకున్నాము అని పెట్టడం మంచిది (వికీపీడియా కూడా ఇదే చెబుతుంది).

మీరు ఇతరుల వనరులు వాడుకుంటానని సెలవిచ్చారు. మీరేందుకు ఈ విషయం ఫలాన చోటు నుండి సేకరించిందని పేర్కోనడం లేదు? అంటే మీకో నీతి ఇతరులకు ఇంకో నీతా?

రావు:-  జైల్ సింగ్ నా స్వంతం కాకున్నా వాక్యాలను రూపుదిద్దినది మాత్రం నేనే కాబట్టి ఆ వాక్యాలపై నాకు పూర్తి అధికారం ఉంది. నేను ఎవరివద్ద నుంచీ మక్కికిమక్కి చేయడం లేదు కాబట్టి వనరులు ఇచ్చే అవసరం కూడా లేదు.

జైల్ సింగ్  (ఇది ఒక్క జైల్ సింగ్ గారి గురించి కాదు మీ బ్లాగులో ఉన్న కాంటేంట్‌కు ఉదహారణ) పుట్టిన తేది, మరణించిన తేది, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి అయిన తేదీలు మీరు రాశారు, ఇలాంటి విషయాలు ఎవరు రాసిన మక్కికి మక్కిగానే వస్తాయి. మీరు రాశారని మేం మార్చి రాయాలా?!!!!


రావు:-  జైల్ సింగ్ పోస్టులోని కొన్ని వాక్యాలు తీసుకొని  మరికొన్ని వనరుల నుంచీ సమాచారం సేకరించి మీరు కొత్తగా వ్యాసం తయారుచేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. అంతేకాని మక్కికిమక్కిగా నాదైన శైలిలో తయారుచేస్తున్న సమాచారం కాపీచేయరాదనేదే నేను చెప్పేది.

రావు:- వాక్యాలను రూపుదిద్దినది మాత్రం నేనే కాబట్టి ఆ వాక్యాలపై నాకు పూర్తి అధికారం ఉంది. నేను ఎవరివద్ద నుంచీ మక్కికిమక్కి చేయడం లేదు కాబట్టి వనరులు ఇచ్చే అవసరం కూడా లేదు.

రావు గారు పై వ్యాఖ్యను కింది వ్యాఖ్యను మరొక్క సారి పరిశీలించండి
 మిటండి రెండు నాలుకల దోరిణి. ఇక్కడ నేను ఒక జైల్ సింగ్ గారి పోస్ట్ గురించే వాదించడం లేదు. //హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది// అనే మీ మాటకు మాత్రమే నా స్పందన. నా పోస్టులోని కొన్ని వాక్యాలు తీసుకొని  మరికొన్ని వనరుల నుంచీ సమాచారం సేకరించి మీరు కొత్తగా వ్యాసం తయారుచేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. అంతేకాని మక్కికిమక్కిగా నాదైన శైలిలో తయారుచేస్తున్న సమాచారం కాపీచేయరాదు. మీ హెచ్చరిక స్థానంలో ఈ వ్యాఖ్యను ప్రదర్శించండి సమంజసంగా ఉంటుంది.అంతే గాని తలా తోక లేని నిబందనలు పెట్టకండి. రావు గారు మీకొక్క విషయం చెప్పాలండీ ఇప్పుడు బ్లాగుల్లో,ఇంటర్‌నెట్లలో 99.99 శాతం సమాచారం ఎక్కడో అక్కడి నుండి సేకరించినదే. స్వంతంగా రాసే రచనలను ఎవరు కాపీ కొట్టేందుకు ప్రయత్నించరండి. వేమన,సుమతీ లాంటి శతకాలను ఒక్క సారి పరిశీలించండి. వాటికి పేటేంట్లు, కాపీరైట్ చట్టాలు హెచ్చరికలు  ఉన్నాయా ? ఈ శతకాల్లో ఒక్క పదాన్ని మార్చి నా స్వంతం అనుకో గలమా, వీటీలో పదాలను మార్చే ధైర్యం చేయగలమా?

నేను మీకు CCKరావు గారు నేనొక విషయం మిమ్మల్ని సూటిగా అడుగాలనుకుంటున్నాను YES/NO రెండే మాటల్లో చెప్పండి. మీబ్లాగ్‌లో ప్రచురించే ప్రతి విషయం ఎక్కడ చదవకుండా,సేకరించకుండా మీరే స్వంతంగా తయారు చేస్తున్నారా? YES/NO అనే  కామేంట్ రాశాను.
దానికి సమాదానం ఇవ్వచ్చు కాని పోస్ట్ రూపంలో రాశారు  ప్రపంచంలో మీకొక్కరికే బ్లాగుందా? మాకు లేవా? మేం రాయలేమా?పత్రికల అనుమతులు లేకుండా వారి పేపర్ల కట్టింగ్‌లను మక్కికి మక్కిగా రిఫరెన్సులుగా ఉపయోగించే సంఘటనలు ఉన్నాయి. ఏ పత్రికలు ఇది మీరు చదవటానికి మాత్రమే రెఫరెన్సులుగా ఎక్కడ ఉపయోగించ వద్దని చెప్పిన దాఖలాలు లేవే, ఇలాంటివి చాలా బ్లాగుల్లో దర్శనమిస్తున్నాయి కూడా. మీది కాని దానిపై మీకు నాది అనే ఆహం ఉంది అందుకే మీరు ఇలా హెచ్చరిస్తున్నారు.రావు గారు ఏ లాబాపేక్ష లేకుండా మనం రాసిన దాన్ని ఇతరులు వాడుకుంటున్నారంటే మనకు గర్వ కారణమే కదండి. మన రచనలు వాడుకున్న ఇతరులకు   మనకున్న పరిజ్ఞానం లేదనేగా అర్థం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందండి ఆలోచించండి.

  మీరు వాదించేదే సమంజసమని మీరనుకుంటే మీ బ్లాగులో పబ్లిష్ అయ్యే ప్రతి పోస్ట్‌ను నా బ్లాగులో పబ్లిష్ చేస్తాను ఏ కాపీ రైట్ చట్టాలు ఉపయోగించి నాపై చర్య తీసుకుంటారో మీ ఇష్టం.

3 comments:

  1. పుట్టిన తేది, మరణించిన తేది, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి అయిన తేదీలు మీరు రాశారు, ఇలాంటి విషయాలు ఎవరు రాసిన మక్కికి మక్కిగానే వస్తాయి. మీరు రాశారని మేం మార్చి రాయాలా?!!!!

    kevvvvvvvvvvvv

    ReplyDelete
  2. Anonymous గారు CCKరావు వరస అలాగుందండి మరి.

    ReplyDelete
  3. raatallo kooda copielaa ......yem batukulu raa baabu

    ReplyDelete

మీ అమూల్యమైనా అభిప్రాయం తెలియచేయండి.